Popular Posts

Thursday 16 August 2012

 Wrestler Sushil Kumar Wins India Silver Medal

లండన్, ఆగస్టు 13: లండన్ ఒలింపిక్స్‌లో ఆఖరి రోజు 66 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతం సాధించాడు. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. బీజింగ్ ఒలింపిక్స్ భారత్మూడు పతకాలను సాధిస్తే... లండన్ ఒలింపిక్స్‌లో ఏకంగా ఆరు పతకాలను(2 రజతాలు, 4 కాంస్య ) తెచ్చి భారత్ కీర్తి ప్రతిష్టతలను మరింత పెంచారు.
బీజింగ్‌లో కాంస్యం గెలిచిన ఈ హర్యానా రెజ్లర్... లండన్‌లో దాన్ని మెరుగుపరచి రజతం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన యొన్ మిత్సు తాత్సుహిరో చేతిలో 1-3తో ఓడిన సుశీల్ రెండో స్థానంతో నిలిచాడు. ఐతే వరుసగా ముగ్గురు ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్‌కు చేరే క్రమంలో సుశీల్ ప్రదర్శించిన పోరాటపటిమ అభినందనీయం. తొలి మూడు మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడి అస్వస్థతకు గురికావడంతో ఫైనల్లో ఆ దూకుడు కాస్త తగ్గినట్లు కనిపించింది.
66 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌కి ముందు బౌట్‌కు ముందు కడుపులో వికారం వల్ల వాంతులు చేసుకున్న సుశీల్ ప్రత్యర్థిని సమర్థంగా అడ్డుకోలేకపోయాడు. దీంతో తొలి పిరియడ్‌లో 0-1తో వెనుకబడ్డాడు. దాదాపు ఆరు కిలోల బరువు తగ్గడంతో జపాన్ రెజ్లర్‌పై పట్టు దొరకలేదు. బౌట్‌లో కూడా చురుకుగా లేకపోవడంతో ‘ఆర్మీ మ్యాన్' తాత్సుహిరో పైచేయి సాధించాడు. రెండోరౌండ్‌లో కేవలం 30 సెకన్లలోనే సుశీల్‌ను పెకైత్తి మ్యాట్‌పై పడేశాడు. దీంతో మూడు పాయింట్లు గెలిచి ఆధిక్యం సంపాదించాడు. చివరి వరకు పోరాడిన భారత రెజ్లర్‌కు ఒక్క పాయింట్ మాత్రమే రావడంతో బౌట్ చేజారింది.
సుశీల్ కుమార్ వ్యక్తిగతం:
పుట్టిన తేదీ: మే 26, 1983 (29 ఏళ్లు), బాప్రొలా, ఢిల్లీ
తల్లిదండ్రులు: కమలా దేవి, దివాన్ సింగ్ (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్సు డ్రైవర్)
అవార్డులు: అర్జున, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ
ఇష్టం: రాగిణి (జానపద) సంగీతం
ఉద్యోగం: రైల్వేలో డిప్యూటీ కమర్షియల్ మేనేజర్
కెరీర్ విజయాలు
ఒలింపిక్స్: 1 రజతం,1 కాంస్యం
కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణం
ఆసియా క్రీడలు: 1 కాంస్యం
వరల్డ్ చాంపియన్‌షిప్: 1 స్వర్ణం
కామన్వెల్త్ చాంపియన్‌షిప్: 4 స్వర్ణాలు
ఆసియా చాంపియన్‌షిప్: 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలు
తెలుగు వన్ఇండియా

No comments:

Post a Comment