Popular Posts

Thursday 16 August 2012

లండన్: టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంకుపై గురిపెట్టిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టును తడబడుతూ ఆరంభించింది. లార్డ్స్‌లో గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు సాధించింది. ఆరంభంలో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీలను డుమిని (61), జాక్ రుడాల్ఫ్ (42), వెర్నోన్ ఫిలాండర్ (46 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, స్టీఫెన్ ఫిన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఫిలాండర్‌తో పాటు డేల్ స్టెయిన్ (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆర

లండన్: సహచర క్రికెటర్లను కించపరిచేలా దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు మెసేజ్‌లు పంపి ఆనక క్షమాపణలు చెప్పిన ఇంగ్లండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్.. టి-20 ప్రపంచ కప్ జ ట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ టోర్నీలో పీటర్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లంకలో వచ్చే నెల్లో జరిగే తాజా ఈవెంట్‌కు తనకు స్థానం లభిస్తుందనే ఆశతో ఉన్నాడు. తుది జట్టును ప్రకటించిందేందుకు ఐసీసీ శనివారం వరకు గడవు విధించింది. కాగా కెప్టెన్ స్ట్రాస్‌తో పాటు ఇతర ఆటగాళ్ల గురించి తనకు సన్నిహితులైన సఫారీలకు మెసేజ్‌లు పంపినట్టు కెవిన్ అంగీకరించాడు. అయి తే ఈ విషయాన్ని స్ట్రాస్ తేలిగ్గా తీసుకున్నాడు. పీటర్సన్‌తో తానెప్పుడూ గౌరవంగా ఉంటానని, అతనూ అలాగే వ్యవహరిస్తాడని చెప్పాడు. మెసేజ్‌ల విషయం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.



No comments:

Post a Comment